March 2026 నెలకు శ్రీవారి దర్శనాలు, వివిధ ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా వివరాలు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు విడుదల March 2026 చేశారు.
Read Also: Tirumala: కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!

ప్రధాన సేవల కోటా:
- సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా: మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల, 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 20–22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలో చెల్లించినవారికి టికెట్లు మంజూరు.
- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు: 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల. వర్చువల్ సేవల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు.
- అంగ ప్రదక్షిణ టోకెన్లు: 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల.
- శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు: 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో.
- వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్లు: 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు.
- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (300 రూపాయలు): 24వ తేదీ ఉదయం 10 గంటలకు.
- వసతి గదుల కోటా: 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు.
వసతి గదుల వివరాలు:
- తిరుపతిలో: శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం గృహాలు
- తిరుమలలో: శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు
- భక్తులు టికెట్లు మరియు గదులను TTD అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని TTD సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: