ఆంధ్రప్రదేశ్ లోని, సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు కోహ్లీ (Virat Kohli). కోహ్లీ రాక సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. దర్శనం తర్వాత ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు కోహ్లీ. తర్వాత పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు.
Read Also: Actress Pragati: ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటిన నటి ప్రగతి

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గా కోహ్లి
విరాట్ కోహ్లి (Virat Kohli) రాకతో సింహాద్రి అప్పన్న ఆలయంలో సందడి నెలకొంది. భక్తులు తమ అభిమాన క్రికెటర్ ను చూసేందుకు ఎగబడ్డారు. ఆలయంలో కొందరికితో విరాట్ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లికి దైవ భక్తి ఎక్కువే అన్న విషయం తెలిసిందే.
ఏ ప్రాంతానికి వెళ్లినా.. సమయం ఉన్నపుడు అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంటాడు. ఇక శనివారం, విశాఖ వన్డేలో కోహ్లి చెలరేగిన విషయం తెలిసిందే. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: