హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం (Kartika Masam) అత్యంత పావనమైనదిగా భావిస్తారు. ఈ నెలలో జరుపుకునే సోమవారాలు మరింత విశిష్టతను కలిగి ఉంటాయి. భక్తులు ఈ రోజున శివపార్వతీ అమ్మవార్లను ఆరాధించి, తమ కోరికలు నెరవేరాలనే మనసుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక సోమవారం (Kartika Masam)ను శుభప్రదమైనదిగా, పుణ్యప్రదమైనదిగా, శివకృపగా చూడటం మన పురాణాల్లో, ఆధ్యాత్మిక సంస్కృతిలో విరివిగా కనిపిస్తుంది.
Read Also: Chhath Puja:ఉపవాసానికి ముందు తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన పానీయాలు

ఈరోజు పొద్దున్నే లేచి, చన్నీటి స్నానం చేసి, దీపారాధన చేయాలి. నిత్య పూజానంతరం కార్తీక పురాణం పఠించాలి. ఫలితంగా విశేష ఫలితాలుంటాయి. భక్తులు శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుంది. ‘హర హర మహాదేవ శంభో శంకర’ నామస్మరణ చేస్తూ శివాలయాన్ని సందర్శించాలి. సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనది కాబట్టి, చంద్రుడిని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: