తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు
విజయవాడ : కార్తీకమాసం(Karthika Masam) చివరి సోమవారం కావడంతో… ఓ వైపు నదీ తీరాలు.. మరో వైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో విజయవాడ కృష్ణానది తీరంలో ఘాట్ల వద్ద భక్తుల సందడి కన్పించింది. పుణ్యస్నానాలు, దీపారాధనలు చేసారు. కృష్ణా నది గోదావరి నది సంగమ స్థలిలో పెద్ద ఎత్తున కార్తీక మాసం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేసారు. అమరావతిలో అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసారు. చిలకలపూడి (మచిలీపట్టణం), బాపట్ల, ఇతర సముద్రతీరాల్లో భక్తులు స్నానాలు చేసారు. అంతర్వేది దగ్గర భక్తులు స్నానాలు చేసారు. రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలుముకుంది.
Read Also: TTD: వైకుంఠ ద్వార దర్శనంలో స్థానికులకు అవకాశమిస్తారా?

తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగింది. పలుస్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆథ్మాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్పస్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవిత్ర కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. మురమళ్ళలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, కుండేశ్వరం పార్వతీ కుండలేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.

తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వృద్ధ గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మరో వైపు ప్రకాశం జిల్లా పొదిలిలో కార్తీకమాసం సందర్భంగా మండంలో అయ్యప్పస్వామి పడిపూజలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాటూరివారి పాలెం, పొదిలి అచ్చిరెడ్డి నగర్లో అంగరంగ వైభవంగా అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించి భజనలు చేశారు. సకల దేవత పాటలు పాడుతూ స్వామి వారి సేవలో మునిగిపోయారు. మాలాధరణ చేసిన స్వాములు పూజ మహోత్సవ పాల్గొని స్వామివారి కృపను పొందారు. అనంతరం పడిపూజ నిర్వాహకులు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు.. ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల, కాసరబాదా, మోగులూరు, వేదాద్రి వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: