हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Janhvi Kapoor: శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌..సిద్ధార్థ్‌ మల్హోత్ర

Anusha
Janhvi Kapoor: శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌..సిద్ధార్థ్‌ మల్హోత్ర

బాలీవుడ్ యువ నటీనటులు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), సిద్ధార్థ్‌ మల్హోత్ర తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం గురువారం ఉదయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామునే వీరిద్దరూ తిరుమల చేరుకొని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి నైవేద్య విరామ సమయంలో దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో అడుగుపెట్టిన క్షణం నుంచే వీరిని చూసేందుకు అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీరి రాకతో తిరుమలలో కాసేపు బాలీవుడ్ హంగు అలముకుంది.దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు జాన్వీ, సిద్ధార్థ్‌ (Sidharth Malhotra) లకు వేద మంత్రోచ్చారణల నడుమ ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు వీరిని పట్టు వస్త్రాలతో సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Janhvi Kapoor
Janhvi Kapoor

పరమ్ సుందరి

ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసి, భక్తి భావంతో స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకంగా కనిపించింది. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా సంప్రదాయ వేషధారణలో హాజరై భక్తి భావాన్ని వ్యక్తం చేశారు.ఇకపోతే,జాన్వీ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండ‌గా.. వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటుంది చిత్ర‌యూనిట్. ఈ సినిమా హిట్టు అవ్వాల‌ని కోరుకుంటూ ఈ జంట తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కపూర్‌ జన్మ తేదీ ఏమిటి?

జాన్వీ కపూర్‌ 6 మార్చి 1997న ముంబైలో జన్మించారు.

ఆమె సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది?

జాన్వీ కపూర్‌ 2018లో విడుదలైన ధఢక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/review-of-coolie/review/530141/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870