గరిక పూజ ప్రాముఖ్యం
Ganesh chaturthi: పుష్పజాతులు దెచ్చి పూజింపలేకున్న గరిక పూజను మెచ్చు ఘనుడె వండు? అని కంచర్ల సూర్యనారాయణ కవి గణపతిని గురించి ప్రస్తావించారు.. వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి అర్చించే 21 రకాల పత్రిలో గరికకు ఉత్తమ స్థానం ఉంది. గరికను(Garika) దూర్వాయుగ్మం (Durvayugma) అని కూడా పిలుస్తారు.
దుర్వాయుగ్మ పూజ తప్పనిసరి
21 రకాల పత్రి, తరువాత పరిమళభరిత పుష్పాలతో గణపతిని (Ganesh chaturthi) పూజించినా దుర్వాయుగ్మ పూజ తప్పనిసరి. రెండు గరిక పోచలను దేవునికి సమర్పించినా గణేశుడు ప్రీతికరంగా స్వీకరించి అందరికీ శుభాలను కలుగజేస్తాడు. దర్భలు దొరకని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గరికను ఉపయోగిస్తారు.
భక్తసులభుడు గణపతి
గణేశుడు భక్తసులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలు అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలు లేకున్నా పరవాలేదు. భక్తితో గరికను సమర్పిస్తే చాలు.. మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. భక్తసులభుడైన గణపతి పూజకి మూర్తి లేకున్నా పసుపుముద్దతో గణేశుణ్ణి చేసి ఆరాధించినా వరాలను ఇచ్చే అభయప్రదాత వినాయకుడు.

అనలాసురుడు – గరికతో తాప నివారణ
గరికకు ఎందుకు ప్రాధాన్యం అనే దానికి ఒక పురాణ కథ ఉంది. పూర్వం అనలాసురుడనే రాక్షసుడు తన రాక్షస ప్రవృత్తితో అందరినీ హింసించసాగాడు. అతడు అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు.
అనలాసురుని బారి నుండి తప్పించుకునేందుకు మార్గాలన్నీ మూసుకుపోగా, దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు గరళాన్ని మింగినట్లుగానే వినాయకుడు అనలాసురుణ్ణి మింగేసాడు. అగ్నితత్వంగల అనలాసురుని మింగడం వల్ల వినాయకుని ఉదరంలో తాపం కలిగింది. ఎన్ని ఔషధాలు వాడినా తాపం తగ్గలేదు.
చివరకు పరమేశ్వరుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అందువల్ల గణేశుని పూజాలో ఉపయోగించే పత్రిలో గరికకు అంత ప్రాధాన్యం.
తమిళనాడులో గరిక ప్రాధాన్యం
తమిళనాడులో వాడవాడలో కనిపించే గణేశుని(Ganesh chaturthi) ఆలయాల్లో స్వామికి గరికను ప్రతిరోజూ సమర్పిస్తారు. గరిక నత్రిదోషాలను హరిస్తుంది.
దూర్వాసూక్తం
“సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతుమే పాపం”
Read Also: