हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Medaram Gaddelu : రూ.101 కోట్లతో గద్దెల విస్తరణ – మంత్రి సీతక్క

Sudheer
Medaram Gaddelu : రూ.101 కోట్లతో గద్దెల విస్తరణ – మంత్రి సీతక్క

ఈసారి జాతరలో భక్తులకు సరికొత్త అనుభూతినిచ్చేలా గద్దెల ప్రాంగణాన్ని పూర్తి రాతి కట్టడంగా తీర్చిదిద్దుతున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారం చరిత్రను కళ్లకు కట్టేలా నిర్మాణాలు చేపడుతున్నారు. జాతర ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్రను ప్రతిబింబించేలా 59 విగ్రహాలను (బొమ్మలను) చెక్కించినట్లు మంత్రి వెల్లడించారు. మేడారం కథలో కీలక ఘట్టాలు, గిరిజన యోధుల వీరగాథలు ఈ తోరణం ద్వారా నేటి తరానికి తెలిసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక పండుగలా కాకుండా, గిరిజన అస్తిత్వాన్ని చాటిచెప్పేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్ల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్య పనులతో పాటు జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా ఘాట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కోటి మందికి పైగా వచ్చే భక్తుల భద్రత కోసం భారీగా పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మేడారం వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవార్ల ఆశీస్సులు లభించడంతో పాటు, ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870