తిరుమల : తిరుమ లలో అశేషసంఖ్యలో భక్తులకు ఇతోధిక సేవలం దిస్తున్న శ్రీవారిసేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు అని టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి(EO Venkaiah Chowdhury) తెలిపారు. దేశవిదేశాల నుండి వస్తున్న లక్షలాదిమంది భక్తులకు సేవచేయడంలో శ్రీవారిసేవకుల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. తమతమప్రాం తాల్లోని శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక విభా గం, ఐఐఎం అహమ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూల్లను రూపొందించారని తెలిపారు. మంగళవారం తిరుమలలో సేవాసదన్-2 లో శ్రీవారిసేవకుల గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిం చిన తొలిబ్యాచ్ “ట్రెయిన్ ది ట్రైనీస్” శిక్షణ కార్యక్రమం మొదలైంది.
Read Also: Tirumala: ‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

ఈ కార్యక్రమంలో పాల్గోన్న అదనపు ఇఒ వెంకయ్యచౌదరి(EO Venkaiah Chowdhury) కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగం గా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ట్రెయిన్ దిట్రైనీస్ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. హిందూ ధర్మానికి శ్రీవారి సేవకుల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆయన అభి వర్ణించారు. ఈ శిక్షణలో వ్యక్తిత్వవికాసం, నైపు ణ్యాల పెంపు, కమ్యూనికేషన్, భక్తులతో నడవ డిక, నాయకత్వ లక్షణాలు, టిటిడి చరిత్ర, శ్రీవారిసేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారు.
దీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణని చ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ శిక్షణ తరగతుల సారాన్ని గ్రహించి ఇతర సేవకులను కూడా సమర్ధవంతంగా తీర్చిదిద్దాలని గ్రూప్ సూపర్వైజర్లకు అదనపు ఇఒ చౌదరి సూచిం చారు. ఈ కార్యక్రమంలో పండితుడు డాక్టర్ మేడ సాని మోహన్, డాక్టర్ దామోదం నాయుడు, డాక్టర్ శ్రీనివాస్, టిటిడి సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్ ఒ నీలిమ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: