దీపావళి (Diwali 2025) పండుగ అంటే వెలుగుల పండుగ, ఆనందాల పండుగ. ప్రతి ఏడాది లాగా ఈసారి కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంగా దీపావళి పండగకు సిద్ధమవుతున్నారు. ఈ పండుగను అక్టోబర్ 20 సోమవారం రోజున ఘనంగా జరుపుకోనున్నారు. దీపావళి (Diwali 2025) రోజున ఇంటిని శుభ్రపరచి, కొత్తగా అలంకరించి, దీపాలతో వెలిగించి, లక్ష్మీదేవిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మహాలక్ష్మి పూజ నిర్వహిస్తారు.
Read Also: PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
దీపావళి పండుగ (Diwali festival) వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన చాలా గొప్పది. ఈ రోజున శ్రీమహాలక్ష్మి దేవి భూమిపైకి అవతరిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఆమెకు ఇష్టమైన రంగులు, పూలు, వంటకాలు ఉపయోగించి పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు.
పండుగ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచి, పువ్వులతో అలంకరిస్తారు. ఎందుకంటే శుభ్రత, స్వచ్ఛత ఉన్న చోటే లక్ష్మీదేవి నిలయముంటుందనే నమ్మకం ఉంది.

దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం చాలా మంచిది. ఈ రోజు మహిళలు తప్పకుండా పసుపు రంగు దుస్తులు ధరించాలని చెబుతున్నారు పండితులు. పసుపు రంగు అనేది బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది.

అందువలన శాంతి, సంపదకు ప్రతీక అయిన పసుపు రంగు దుస్తులు ధరించి, పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంట.అదే విధంగా దీపావళి సమయంలో లక్ష్మీ పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా శ్రేయస్కరం అంటున్నారు పండితులు.
ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమకు ప్రతి రూపమైనది, ఇది కుజ గ్రహంతో సంబంధం ఉంటుంది. అందువలన దీపావళి సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన కూడా ధనప్రాప్తి కలుగుతుందంట.

తెలుపు రంగు దుస్తులు శాంతికి ప్రతీకం. అయితే దీపావళి పండుగ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ పూజ చేయడం మంచిదంట.తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు పండితులు.
ఇక దీపావళి పండగ రోజున లక్ష్మీ పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు దుస్తులను ధరించకూడదంట. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వలన పాజిటివ్ వైబ్స్ తగ్గడమే కాకుండా, ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయంట.

అదే విధంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే నలుపు అనేది శని దేవుడికి సంబంధించినది, ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం అశుభకరం, దీని వలన మానసిక ఒత్తిడి, నిరాశ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయంట.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: