తమిళనాడు(Tamilnadu)లోని మహాబలిపురంలో చెక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగాన్ని బీహార్‌లోని తూర్పు చంపారన్‌లో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరానికి(Bihar) తరలిస్తున్నారు. నవంబర్ 21న పూజల అనంతరం ఈ లింగం ప్రయాణం ప్రారంభమైంది. 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువున్న ఈ శివలింగాన్ని 96 చక్రాల ప్రత్యేక హైడ్రాలిక్ వాహనంపై 20–25 రోజుల్లో గమ్యస్థానానికి తీసుకెళ్తున్నారు.
Read also : Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ…

దేశంలోనే అతి పెద్ద రామాయణ ఆలయం
దేశంలోనే అతి పెద్ద రామాయణ ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ మందిరం 1,080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో నిర్మాణంలో ఉంది. 22 మండపాలు, 18 గోపురాలు, 270 అడుగుల ప్రధాన గోపురం దీనిలో భాగం. ఇప్పటికే ప్రధాన ద్వారం, వినాయక ఆలయం, నంది విగ్రహం వంటి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. శివలింగ ప్రతిష్ఠ(Shivlinga Prathista) అనంతరం మిగిలిన పనులు వేగవంతం కానున్నాయి.
మహాబలిపురం నుంచి చకియా(chakiya) వరకు లింగం ప్రయాణంలో భక్తుల స్వాగతం కోసం పలు ప్రదేశాల్లో వేదికలు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కారణాల కోసం ట్రాఫిక్ మార్గాలు మార్చి, ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రతికిలోమీటరు సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయి.
చకియాకు చేరిన తర్వాత, ప్రత్యేక శుభ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరగనుండగా దేశం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు పాల్గొననున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :