బెంగళూరులోని(Bengaluru) ప్రముఖ హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం వివాహాల నిర్వహణపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు జరపకూడదని పూజారులు, నిర్వాహకులు కలిసి నిర్ణయించారు.
Read Also: Bangalore : గ్యాస్ గీజర్ లీక్ వల్ల రెండు ఘటనల్లో ముగ్గురి మృతి

విడాకుల కేసులు పెరగడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం
ఇటీవలి కాలంలో ఆలయంలో జరిగిన పెళ్లిళ్లలో అనేక జంటలు కొద్ది రోజుల్లోనే విడాకులకు (divorce) వెళ్లడం, కొందరు తప్పుడు పత్రాలతో వివాహం చేసుకోవడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి విచారణల కోసం పూజారులు తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడంతో, దైవ సేవకన్నా న్యాయస్థానాలకె వెళ్లడంలో ఎక్కువ సమయం గడుస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రేమ జంటలు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించడం వల్ల పూజారులు అనవసరంగా వివాదాల్లో ఇరుక్కొంటున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆలయ ప్రతిష్ఠకు భంగం(Bengaluru) కలుగుతోందని నిర్మాణ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో అవసరమైతే నిర్ణయాన్ని పునఃసమీక్షించవచ్చని పేర్కొంటూ, ఆలయ పరిసరాల్లో పెళ్లి వేడుకల నిర్వహణపై తాత్కాలిక నిషేధం విధించింది.
శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాహ సంప్రదాయాన్ని నిలిపివేయడంతో భక్తుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీన్ని ఆలయ పవిత్రతను కాపాడే చర్యగా స్వాగతించగా, మరికొందరు ఇది సాంస్కృతిక ఆచారాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: