జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని(Astrology Tips) వంటి దశల్లో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తారు. అయితే ఇదే సమయంలో కొందరికి ఉద్యోగావకాశాలు, వివాహం, స్థిరత్వం వంటి శుభ పరిణామాలు కూడా కలగవచ్చని పండితులు చెబుతారు.
శని కాలంలో జాగ్రత్తలు, ఆచరణలు

శని ప్రభావం(Astrology Tips) మృదువుగా ఉండేందుకు రోజువారీ ఆధ్యాత్మిక ఆచరణలు ఎంతో ఉపయోగకరమని నమ్మకం. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం, సుందరకాండ పఠనం, ఆదిత్య హృదయ స్తోత్ర జపం చేయడం మనసుకు శాంతిని కలిగిస్తుందని చెబుతారు.
శనివారాల్లో శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, కాకులకు ఆహారం పెట్టడం, ఆవులకు గోగ్రాసం ఇవ్వడం పుణ్యప్రదంగా భావిస్తారు. అలాగే పంచాక్షరీ మంత్రాన్ని నియమంతో జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని ఆచార్యులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: