శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో(Srikalahasti) ఏడు గంగమ్మల జాతర దేవస్థానం(AP) పాలకమండలి, జారత కమిటి నిర్వాహకుల సమన్వయంతో వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ల పిలుపుతో మంగళవారం మధ్యాహ్నం జాతర పిలుపు అన్నట్లు ఒక్కసారిగా వంద డప్పులు మోగుతుండగా కళాకారులు ఆడుతూ పాడుతూ సాగగా చూడటానికి వేయి కళ్లు చాలవన్నట్లు మారింది.
Read also: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

శ్రీకాళహస్తి గంగమ్మ జాతరలో అలంకారాలు, ఊరేగింపులు
ఊరేగింపును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి(AP) ప్రారంభించారు. పెండ్లి మండపం గంగమ్మ కమిటి నిర్వాహకులు కాసరం రమేష్, బేరివారి మండపం నిర్వాహకులు వజ్రం కిషోర్ సారధ్యంలో మండపాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా తీర్చి దిద్దారు. కాగా పెండ్లి మండపం వద్ద కాషాయ రంగుల జెండాలతో రిబ్బన్లతో ముస్తాబు చేసారు. నాలుగుమాడ వీధుల్లో విద్యుత్ దీపాల కాంతితో దేదీప్యమానంగా మారింది. కాగా ఊరంతా దేవస్థానం అరటి చెట్లతో ముస్తాబు చేసారు. అలాగే గంగమ్మకు ఇష్టమైన వేపాకు తోరణాలతో ముస్తాబు చేసారు. ఇక జాతర కమిటిల నిర్వాహకులు ఎవరికి వారు ప్రత్యేకతను చాటుకొనుటకు పోటీలు పడ్డారు. దాంతో జాతరకు ప్రత్యేకత సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: