విజయవాడ : నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసులో మాజీమంత్రి జోగి రమేష్ (jogi ramesh) రిమాండ్ ను ఈ నెల 25 వరకూ పొడిగించారు. ఆయనతో పాటు ఈ కేసులో మరో నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఎక్సైజ్ కోర్టు తెలిపింది. ఈ మేరకు గురువారం వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట వీరిరువురినీ అధికారులు హాజరుపరిచారు.
Read also: AP: త్వరలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లు

AP: జోగి రమేష్ కు 25 దాకా రిమాండ్ పొడిగింపు
ఈనెల 17కి వాయిదా
అయితే పోలీస్ కస్టడీ పిటిషన్ల విచారణను మాత్రం ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్టు ఎక్సైజ్ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను కూడా ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. లిక్కర్ స్కాం లో నిందితులు చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడుల బెయిల్ పిటిషన్ మీద ఎసిబి కోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఈకేసుపై ఈనెల 17న మరోసారి విచారణ చేపట్టనున్నట్టు న్యాయ స్థానం తీర్పు వెలువరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: