AP: భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లో దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్‌ను పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చే కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.
Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు
శ్రీశైలం, కాణిపాకంలో ఆన్‌లైన్ దర్శన సేవలు పూర్తి స్థాయిలో అమలు
ఇప్పటికే దేవాదాయ శాఖ ఆన్‌లైన్ సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా ‘ఏపీ టెంపుల్స్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా భక్తులు దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను సులభంగా బుక్ చేసుకుని ఆలయ దర్శనానికి రావచ్చు. శ్రీశైలం ఆలయానికి సంబంధించి ఈ సేవలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని ఆలయ ఈవో తెలిపారు.

అదేవిధంగా కాణిపాకం(Kanipakam) స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కూడా దర్శనం, సేవలు, వసతి, ప్రసాదం టికెట్లను ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్(website)తో పాటు వాట్సప్ సేవలను కూడా ప్రారంభించారు. భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునేలా అవకాశం కల్పించారు.

దేవాదాయ శాఖ కీలక నిర్ణయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకూ అన్ని సేవలు త్వరలో పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో భక్తులు స్వయంగా టికెట్లు పొందేందుకు 100 కియోస్క్‌ల ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. దర్శనం, సేవలు, పార్కింగ్ టికెట్ల జారీ కోసం పోస్ యంత్రాలను వినియోగించాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మనమిత్ర’ యాప్‌లో కూడా ఆలయ దర్శనం, సేవలు, వసతి బుకింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఈ సేవలపై భక్తులకు మరింత అవగాహన కల్పించేందుకు అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక వాట్సప్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: