ఆ పదిరోజులు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు :టిటిడి ఇఒ సింఘాల్
తిరుమల : వైఖానస ఆగమంప్రకారం పూజలందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పదిరోజుల వైకుంఠద్వారదర్శనాలు సామాన్యభక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్(Anil Kumar) తెలిపారు. డిసెంబర్ అధికసమయం 30వతేదీ వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి ,2026 నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి 1న దర్శనాలకు సంబంధించి పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇ డిప్ ద్వారా 1.76లక్షల సర్వ దర్శనం టోకెన్లు జారీ చేశామన్నారు. ఈ టోకెన్లు కలిగి ఉన్న వారిని మాత్రమే ఆ మూడు రోజులు వైకుంఠద్వార దర్శనాలు కల్పిస్తా మన్నారు. జనవరి 2వతేదీ నుండి 8వతేదీ వరకు వారంరోజులు ఎటువంటి దర్శన టిక్కెట్లు, టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చినా సామాన్యభక్తులను యధావిధిగా వైకుంఠమ్ 2 నుండి సర్వదర్శనంలో అనుమతిస్తామన్నారు.
Read Also: Tirumala: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

సామాన్యులకు 164 గంటలు కేటాయింపు
వివిఐపిలు, విఐపీలు స్వయంగా వస్తేనే వారికి వైకుంఠద్వార దర్శనాలు కల్పిస్తామన్నారు. జనవరి 2వతేదీ నుండి 8వరకు ఆన్లైన్లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశదర్శనాల టిక్కెట్లురోజుకు 15వేలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు రోజుకు వెయ్యిలెక్కన ఆన్లైన్లో విడుదల చేశామన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్యభవనంలో “డయల్ యువర్ ఇఒ” కార్యక్రమం జరిగింది. టిటిడి (TTD) అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సిఇ సత్యనారాయణ, సివిఎస్ కెవి మురళీకృష్ణ, సిపిఆర్ ఒ డాక్టర్లారి రవి, డిప్యూటీ ఇఒలు లోకనాథం, భాస్కర్, రాజేంద్ర, సోమన్నారాయణ, వెంకటయ్య, ఉద్యానవన విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు, డిఎఫ్, ఐటి జిఎం ఫణికుమార్నాయుడు, వింగ్ విఎస ఎన్టీవి రామకుమార్, పిఆర్ ఒ నీలిమ తదితరులతో కలసి డిసెంబర్ 30నుండి జనవరి 8వరకు పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలు ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలుపై ఇఒ సింఘాల్
వివరించారు.
నేరుగా భక్తులకి వైకుంఠద్వార దర్శనం
డిసెంబర్ 30వతేదీ వైకుంఠ ఏకాదశిన ఉదయం స్వర్ణరథం, 31న ద్వాదశిన చక్రతీర్థం జరుగుతాయన్నారు. ఆ పదిరోజులు వైకుంఠద్వార దర్శనాలు 182 గంటలు దర్శన సమయంలో 164 గంటలు సామాన్యభక్తులకు కటాయించామన్నారు.. తొలిమూడురోజులు ఎస్ఇడి టిక్కెట్లు, శ్రీవాణి టిక్కెట్లు రద్దుచేశారు. అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పదిరోజులునిలుపుదలచేశారు. అలాగే తిరుప తిలో ఆఫ్లైన్లో జారీచేసే ఎస్ఎస్ఈ టోకెన్లు కూడా నిలుపుదల చేశారు.
తిరుపతి, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట వాసులకు జనవరి 6,7,8 తేదీల్లో వైకుంఠద్వార దర్శనాలకు రోజుకు ఐదువేల టోకెన్లు మొదట వచ్చినవారికి మొదట అనే విధానంలో 10వతేదీ ఆన్లైన్లో టోకెన్లు జారీచేస్తామన్నారు. భక్తులు సంయ మనం పాటించి వైకుంఠద్వార దర్శనాలను ప్రశాంతంగా చేసుకోవాలని ఇఒ సింఘాల్ కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: