తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరచుకున్నాయి. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు.మొదటగా ప్రముఖులకు (వీఐపీలు) దర్శనం కల్పించారు. ఆ తర్వాత, ఉదయం 6 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభమైంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కొనసాగుతుంది.
Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది
జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు.. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మొదటి మూడు రోజులు.. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో, శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: