కర్నూలు జిల్లాలోని కోడుమూరు (Kodumur in Kurnool district) ప్రాంతంలో ఓ అద్భుత ఆచారం కొనసాగుతోంది. కొండపై ఎగబడి తేళ్లను వెతుకుతున్న భక్తులను చూస్తే తొలుత ఆశ్చర్యమే. కానీ అసలు విషయం తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.ఇక్కడ కొండలరాయుడు అనే స్వామికి భక్తులు తేళ్లను నైవేద్యం (Offering scorpions) గా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఈ ప్రత్యేక పూజ జరుగుతుంది. అదే రోజున స్వామికి తేళ్లు సమర్పిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.తేళ్లను భక్తులు చేతులపై పెట్టుకుంటారు. కొంతమంది తలపై, ముఖంపై కూడా ఉంచుతారు. తాళ్లు కుట్టినా ఏమి కాదని అంటారు. ఒకవేళ కుట్టినా… గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి మాయం అవుతుందని నమ్మకం.

ఈ ఆచారానికి ప్రారంభమైంది ఒక గొప్ప కథతో
ఈ ఆనవాయితీ వెనక ఒక భక్తిశ్రద్ధ కలిగిన కథ ఉంది. 1970లో సౌరెడ్డి, అన్నపూర్ణమ్మ అనే దంపతులు మగ సంతాన కోసమై కొండలరాయుడిని మొక్కుకున్నారు. సంతానం కలిగితే గుడి కడతామని, తేళ్లతో నైవేద్యం చేస్తామని వాగ్దానం చేశారు.వారు కోరుకున్నట్టే మగ బిడ్డ పుట్టింది. ఆ ఆనందంలో గుడిని నిర్మించి స్వామికి తేళ్లను నైవేద్యంగా సమర్పించారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది.ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తేళ్లను తీసుకొచ్చి స్వామికి సమర్పించేందుకు భక్తులు కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు.
వర్షాల మహత్యం కూడా ఇది! స్వామివారి దయ అంటూ భక్తుల విశ్వాసం
ఈ పూజ రోజున వర్షాలు కురవడం ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఎప్పుడూ ముందు రోజు లేదా అదే రోజు వర్షం పడుతుందని భక్తులు చెబుతారు. ఇది స్వామి మహిమగా భావిస్తున్నారు.ఈ స్వామిని శ్రీవెంకటేశ్వర స్వామిగా భావిస్తున్నారు. కొండపై రాయి తీస్తే వెంటనే తేళ్లు కనిపిస్తాయని చెబుతున్నారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇది స్వామివారి అనుగ్రహం.
Read Also : AP – Telangana : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన