Desperate efforts were made to rescue the crew trapped in the SLBC Tunnel

టన్నెల్‌లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు

భారీ నీరు నిలిచిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం

హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ మందగించింది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది. కన్వేయర్‌ బెల్టు సహాయంతోనే వెళ్లే పరిస్థితి ఉండడం.. ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసమవడం, నీరు.. బురద.. బోరింగ్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలడంతో వాటిని బయటికి తీసుకురావాలని.. ఆ తర్వాతే లోపలికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు.

టన్నెల్‌లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు

సొరంగంలోపల విద్యుత్ పునరుద్ధరణ

ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. లోపల ప్రమాదం జరిగిన తీరును.. ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఓ బ్లూ ప్రింట్‌ను (మ్యాప్) తయారు చేశారు. దానిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే బృందాలకు ఇచ్చారు. లోపలికి వెళ్లేందుకు దీన్ని వినియోగించుకుంటారు. మరోవైపు ముందుగా సొరంగంలోపల విద్యుత్ పునరుద్ధరించడం కోసం తగిన సామాగ్రిని పంపిస్తున్నారు. అలాగే ఆక్సిజన్ అందించే వీ ట్యూట్‌ను పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

సుమారు 100 మీటర్లు అడ్డంకి

దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన తీరుపై రెస్క్యూ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకొని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఎలా వెళ్లాలి, అక్కడున్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే కనీసం 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు.

Related Posts
సిరియాలో ఘర్షణలు..70 మందికి పైగా మృతి
Clashes in Syria leave more than 70 dead

లటాకియా : ఇస్లామిక్ దేశం సిరియా లో తిరుగుబాటుదారుల ఆక్రమణతో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. అనంతరం అబూ మొహమ్మద్ Read more

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు: ప్రభుత్వం ప్రకటన
55 Crore People Bath in Kum

మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల Read more

ట్రాఫిక్ దెబ్బకు మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ
etela metro

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. నిత్యం కార్ లలో తిరిగే ఆయన.. తాజాగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో Read more

ఝార్ఖండ్‌లో భట్టివిక్రమార్క బిజీ బిజీ
Bhatti's key announcement on ration cards

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్‌గా ఏఐసీసీ నియమించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ Read more