కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి

నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(శుక్రవారం) ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీనరసిహ స్వామిని దర్శించుకోనున్నారు. తర్వాత, టీడీపీ కూటమి హామీల ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కాగా, ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం అమలు చేయబడుతున్నట్లు వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. దీపం పథకం కింద 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అందుతుందని, చెల్లించిన సొమ్ము 48 గంటల్లో ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

Related Posts
జగన్-షర్మిల ఆస్తి వివాదంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు వ్యాఖ్యలు
rachamallu

జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ ఆస్తుల కోసం షర్మిల Read more

నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
KTR

తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ Read more

ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన అరబ్ దేశాలు
ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన అరబ్ దేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన పథకాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి, ఈ ప్రతిపాదనకు గణనీయమైన ఎదురుదెబ్బ తగిలింది. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణతో ప్రభావితమైన పాలస్తీనా Read more

టీడీపీలో చేరుతున్న తీగ‌ల కృష్ణారెడ్డి
Teegala Krishna Reddy joining TDP

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది Read more