pawan durgamma

దుర్గ‌మ్మ ను దర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు స్వాగతం పలికారు. సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లలో ఉంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈరోజు టికెట్ దర్శనాలను నిలిపేసిన అధికారులు తెల్లవారుజాము నుంచి సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Related Posts
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై కేసు నమోదు
A case has been registered against former minister Kakani Govardhan Reddy

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు Read more

మెగా అభిమానులకు పండగే పండగ
gamechanger song

మెగా అభిమానులకు ఇక నుండి పండగే పండగ. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ Read more

19న బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
KCR to hold BRS executive meet on February 19

పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. హైదరాబాద్‌: ఫిబ్రవరి 19న మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం Read more

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
tirumala brahmotsavam 2024

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *