Deputy CM gave declaration to Tirumala along with daughters

కూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

Deputy CM gave declaration to Tirumala along with daughters.

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకుని దీక్ష‌ను విర‌మించ‌నున్నారు. ఇక మంగ‌ళ‌వారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. నేటి ఉద‌యం స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య‌, చిన్న కూత‌రు పొలెనా అంజ‌ని కొణిదెల‌తో క‌లిసి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.

Advertisements

ప‌వ‌న్ చిన్న కుమార్తె క్రిస్టియ‌న్ కావ‌డంతో టీటీడీ అధికారులు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు తీసుకున్నారు. ఆమె మైన‌ర్ కావ‌డంతో తండ్రిగా ప‌వ‌న్ కూడా ఆ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. కాగా, రాష్ట్రంలో డిక్ల‌రేష‌న్ విష‌య‌మై వివాదం నెలకొన్న వేళ జ‌న‌సేనాని చేసిన ప‌నితో ఒక విధంగా ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లైంది. ఇక స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం ప‌వ‌న్ కల్యాణ్ నేరు తరిగొండ అన్న‌ప్ర‌సాద స‌ముదాయానికి చేరుకోనున్నారు. అక్క‌డ భక్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను డిప్యూటీ సీఎం ప‌రిశీలించ‌నున్నారు. అలాగే భ‌క్తుల‌తో క‌లిసి సహ‌పంక్తి భోజ‌నం కూడా చేస్తార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌-అన్నా లెజ్నెవా కూతురు క‌నిపించ‌డంతో ఆయ‌న అభిమానులు ఆ ఫొటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ చిన్న కూతురు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related Posts
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
ys bhaskar reddy

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలన్న సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు Read more

సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించారు: విజయవాడ సీపీ
సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించారు: విజయవాడ సీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా Read more

Pakistan: 30 లక్షల మంది అఫ్గానీయుల బహిష్కరణకు పాకిస్థాన్‌ ప్రణాళికలు!
Pakistan plans to deport 3 million Afghans!

Pakistan: పాకిస్థాన్‌ 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చి పాక్‌లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్‌ Read more

గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, జట్టు డిల్లీలో ఏమంత్రి నారా లోకేశ్‌ను కలిశారు
lokesh

గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్, వారి బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ Read more

×