Denial of permission for Jagan visit to Guntur

జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరణ

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారని తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే జగన్ పర్యటనకు ఈసీ బ్రేకులు వేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిర్చి యార్డులోకి జగన్ కి అనుమతి లేకుండా ఈసీ నిరాకరించింది. అయినప్పటికీ మిర్చి రైతులను అడిగి తెలుసుకుంటామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ.

Advertisements
జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి

రైతాంగానికి భరోసా ఇచ్ఛామని వైసీపీ

మిర్చీకి రేటు లేక అవస్థలు పడుతున్న రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది. యార్డులో మిర్చి రైతులు దగా పడుతున్నారు. వరి, పత్తికి రేటు లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో 9వేలు పలికిన పత్తి ఇప్పుడు 4వేలకు కూడా కొనేవాడు లేడు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని మేమే కొనుగోలు చేశాం. రైతాంగానికి భరోసా ఇచ్ఛామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

జగన్ పర్యటనపై సందిగ్ధత

ఇంకోవైపు, జగన్ పర్యటనకు వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పర్యటన షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. దాని ప్రకారం, ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. 11 గంటలకు మిర్చియార్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మిర్చియార్డులో రైతులతో చర్చించి… తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించడంతో… జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

Related Posts
ఇండియన్స్ కి ఇకపై ఉద్యోగాలు బంద్ అంటున్న ట్రంప్
ఇండియన్స్ కి ఇకపై ఉద్యోగాలు బంద్ అంటున్న ట్రంప్

భారతీయ విద్యార్థుల్లో అమెరికాలో చదువుకునే అంగీకారం రోజుకో రోజు పెరిగిపోతుంది.వీరి మధ్య ప్రత్యేకంగా వర్కింగ్ వీసాతో వెళ్లే వాళ్లకు కొంత సౌకర్యం ఉంటుందని చెప్పవచ్చు.అయితే, లక్షల రూపాయల Read more

పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష
pawan kalyan to participate in palle panduga in kankipadu

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, Read more

తెలంగాణలో కొత్తగా 12 మున్సిపాలిటీలు
12 new municipalities in Te

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం Read more

సినీ ఇండస్ట్రీలో విషాదం, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య..
సినీ ఇండస్ట్రీలో విషాదం, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య..

టాలీవుడ్‌లో ఒక పెద్ద షాకింగ్ సంఘటన జరిగింది. "కబాలి" చిత్ర నిర్మాత కెపి చౌదరి (కృష్ణ ప్రసాద్ చౌదరి) 100 గ్రాముల కొకైన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో Read more