ఇటీవల వివాహేతర సంబంధాలకు సంబంధించిన హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా మేఘాల హానిమూన్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత ఇలాంటి సంఘటనలే అధికంగా జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.

తాజాగా బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ ఇల్లాలు అతడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది . దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి (Delhi) చెందిన కరన్దేవ్ (36), సుష్మిత భార్యాభర్తలు. సుష్మితకు కరన్దేవ్కు వరుసకు సోదరుడైన రాహుల్తో వివాహేతర బంధం ఏర్పడింది. దీనితో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. విసిగిపోయిన భార్య ఎలాగైనా భర్తను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆమెకు ప్రియుడు కూడా సహకరించాడు. భర్తకు సుష్మిత రాత్రి 15 నిద్రమాత్రలు (sleeping pills) కలిపి భోజనం పెట్టింది. ఆ తర్వాత అతడు చనిపోవడానికి ఎంత టైమ్ పడుతుందనే దానిపై రాహుల్తో చాట్ చేసింది.
కరెంట్ షాక్ ఇచ్చి, ఆసుపత్రికి తరలింపు
భోజనం తర్వాత కరన్ ఇంకా శ్వాస తీసుకుంటుండటంతో ఇంకా మరణించలేదని సుష్మిత రాహుల్కు సమాచారం ఇచ్చింది. రాహుల్ సూచన మేరకు అతడికి కరెంట్ షాక్ (Current shock) ఇచ్చింది. ఆపై విద్యుత్క్గా అపస్మారక స్థితిలోకి వెళ్లాడంటూ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి సిబ్బందు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోస్టుమార్టం అడ్డుకునే ప్రయత్నం
పోలీసులు కరనక్కు పోస్టుమార్గం నిర్వహించాలని చెప్పారు. దీనితో సుష్మిత, రాహుల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనుమానించిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
మృతుడి తమ్ముడి అనుమానంతో అరెస్టు
కరన్ నిద్రమాత్రలవల్ల మత్తు ఎక్కువై మరణించినట్లు తేలింది. దీనితో పోలీసులు సుష్మిత, రాహులు మధ్య జరిగిన చాటింగ్స్ ను పరిశీలించి, తమదైన శైలిలో విచారించగా నిందితులు నిజం ఒప్పుకున్నారు. దీనితో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Mohammad Azharuddin: మహ్మద్ అజారుద్దీన్ ఇంట్లో భారీ చోరీ..