వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీరావు
విజయవాడ : అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్ధమైంది. ఏపీ వ్యవసాయశాఖ సంచాలకులు ఢిల్లీరావు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు (Delhi Rao) తెలిపారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆధార్ నెంబర్ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయని సూచించారు. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు.
అర్హులుగా గుర్తించామని
అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని డిల్లీరావు స్పష్టం చేశారు. వివరాలు రైతులకు మరింత చేరేలా వ్యవసాయ శాఖ (Department of Agriculture) సిబ్బంది ముమ్మర ప్రచారం చేయాలని డిల్లీరావు ఆదేశించారు. అర్హులుగా 47.77 లక్షల రైతులు: ఖిఅన్నదాతా సుఖీభవ పీఎం కిసాని పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98 మందికి ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని ఢిల్లీరావు వివరించారు.

తమ సమస్యలు
సొంతభూమి కలిగిన డీ. పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు. వెబ్ ల్యాండ్లో ఆధార్ జత కాకున్నా, తప్పుగా జోడించినా, చనిపోయిన ఖాతాలు,కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభవ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందుకు త్వరలో అన్నదాతా సుఖీభవ పోర్టల్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు (Farmers Identity Card) పొందడంతోపాటు ఈపంటలో పేరు నమోదు చేసుకోవాలని ఢిల్లీరావు సూచిం చారు. అర్హత ప్రకారం అందరికి లబ్ధి చేకూ రుస్తామని అక్టోబరు, 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ పీఎం కిసాన్ మొత్తాన్ని అందిస్తామన్నారు.
Ap ప్రభుత్వం అన్నదాత పథకం ఏమిటి?
అన్నదాత సుఖీభవ అనేది చిన్న,సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు సంక్షేమ పథకం . వ్యవసాయ ఇన్‌పుట్‌లు, రుణాలు మరియు ఇతర వ్యవసాయ సంబంధిత ఖర్చులకు రైతులకు సకాలంలో మద్దతు లభించేలా చూడటం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం.
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే ఒక పథకం. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ఆర్థిక సహాయం పొందుతారు. మీరు మీ స్టేటస్ ని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు లేదా మీ ఆధార్ నంబర్‌ని 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపడం ద్వారా తెలుసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Konakalla Narayana Rao: ఉచిత బస్సు పథకం అమలుకు సన్నద్ధం