Delhi Government : మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు ఆసియాలోనే అత్యంత పెద్ద జైలుగా పేరుగాంచిన తీహార్ జైలులో ఖైదీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరడుగట్టిన నేరస్తుల నుంచి సాధారణ ఖైదీల వరకు, వేలాది మంది తీహార్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, జైలు అధిక భారం, భద్రతా సమస్యలు, చుట్టుపక్కల ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, దీనికి ప్రత్యామ్నాయంగా మరో భారీ జైలును నిర్మించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీహార్ జైలు భారం తగ్గించేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో మరో విశాలమైన జైలు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. జైలు నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.

తీహార్ జైలు – రద్దీ కారణంగా నిర్ణయం
1958లో పశ్చిమ జనక్‌పురి ప్రాంతంలో 400 ఎకరాల్లో తీహార్ జైలు నిర్మించారు. మొదట 10,026 మంది ఖైదీలు ఉండేలా ఏర్పాటు చేశారు. కానీ, ప్రస్తుతం 19,500 మంది ఖైదీలు ఉండటంతో సౌకర్యాలు పూర్తిగా బహిరంగాయి.
తీహార్ జైలులో గరిష్ట సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటంతో సమస్యలు ఎక్కువయ్యాయి.
జైలు పరిసరాల్లో నివసించే ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖైదీల నడవడికపై మరింత పర్యవేక్షణ అవసరం ఉందని అధికారులు సూచించారు.
ఈ రద్దీ తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే మండోలీ జైలును నిర్మించింది. అదనంగా బాప్రోలా, నరేలా ప్రాంతాల్లో కొత్త జైళ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. తీహార్ జైలును పూర్తిగా ఇంకొక ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నూతనంగా నిర్మించే జైలు తీహార్ కన్నా పెద్దదిగా, ఆధునిక సౌకర్యాలతో ఉండనుంది.
కొత్త జైలు ప్రత్యేకతలు ఏమిటి?
అధునాతన భద్రతా సదుపాయాలు
సీఎన్‌జీ, సోలార్ పవర్ వంటివి ఉపయోగించి పర్యావరణహితంగా నిర్మాణం
ఒకేసారి వేల మందిని చేసే సామర్థ్యం
అత్యాధునిక సీసీ కెమెరాలు, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు