Delhi Elections.. 19.95 percent polling till 11 am.

ఢిల్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్‌..!

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్‌ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్‌ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

image

మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్‌(ఈస్ట్‌), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 26.03 శాతం, 29.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోడ్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Related Posts
పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి
పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి

పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో Read more

urban company : 15 నిమిషాల్లో పనిమనిషి మీ ఇంటికి, అర్బన్ కంపెనీ కొత్త సర్వీస్
15 నిమిషాల్లో పనిమనిషి మీ ఇంటికి, అర్బన్ కంపెనీ కొత్త సర్వీస్

చాల మంది మహిళలకు ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడంతోనే రోజంతా సరిపోతుంది. ఇక అందులో ఇంటి పని అంటే అసలు టైం సరిపోదు. అందుకే ఎక్కువ శాతం Read more

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు బెదిరింపులు
Threats to Maharashtra CM Fadnavis

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. శుక్రవారం ఉదయం పాకిస్థాన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు Read more

నేను తాగుతున్న నీళ్లు కూడా అవే: నరేంద్ర మోదీ
modi

'యమునా జలాల యుద్ధం' ముదురుతోంది. ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ "విషం'' కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన Read more