Delhi CM Rekha Gupta meet Prime Minister Modi

ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భేటీ

రేఖా గుప్తాకు ప్రధాని మోడీ పలు సలహాలు, సూచనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంగా మోడీ ఆమెకు పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని తాను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్, విద్యార్థులను కలిసి మాట్లాడారు.

ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం

మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

ఈ సందర్భంగా రేఖాగుప్తా మాట్లాడుతూ.. ఇక్కడ చదివిన రేఖా గుప్తా మాత్రమే కాదు మీరంతా కూడా సీఎంలు కావాలని విద్యార్థులతో అన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రేఖా గుప్తాకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. కాగా ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కారు.. సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోంది.

25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్‌ నివేదిక

ఫిబ్రవరి 24న నూతన అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్‌ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరిచేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. అనంతరం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాగ్‌ నివేదికపై ఫిబ్రవరి 25, 27 తేదీల్లో చర్చ జరగనుంది.

Related Posts
పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..
పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన Read more

ఈనెల 21, 22న హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
President Draupadi Murmu will visit Hyderabad on 21st and 22nd of this month

హైదరాబాద్‌: ఈ నెల 21,22 తేదీల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అందుకు సంబంధించిన Read more

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

జనవరి 21 నుండి 23 వరకు దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు Read more

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
WhatsApp Image 2024 12 17 at 11.52.32 AM

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం Read more