- ఢిల్లీ రాజకీయ సమీకరణాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి
- ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్ ఈ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధనఖడ్‌లను అబ్జర్వర్లుగా నియమించింది. వీరిద్దరూ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను నిశితంగా గమనించి, కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అబ్జర్వర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించనుండటంతో, అభ్యర్థి పేరు రాత్రి వరకు ఖరారు కానుంది. బీజేపీలో పలువురు ముఖ్య నేతల పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, DCC చీఫ్, అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ, ఇతర ప్రతిపక్ష నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఇది అధికార పక్షం, విపక్షాల మధ్య ఆహ్వాన పూర్వక రాజకీయ సౌహార్దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ రాజకీయ సమీకరణాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.