Delhi Assembly Election Notification Release

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఎన్నికల కమిషన్‌ (ఇసి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుండి నామినేషన్ల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారని తెలిపింది. 18న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరుగనుంది. 8వ తేదీన కౌంటింగ్‌ చేపట్టనున్నారు.

Advertisements

ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని ఇసి వెల్లడించింది. 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 13,033 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆప్‌ పూర్తి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల చేసింది. మిగిలిన 41స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.

Related Posts
గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం
group2ap

గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని APPSC ని ఆదేశించింది. ఈ నెల 25వ తేదీన జరగాల్సిన Read more

పాతపట్నంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి
tiger attacked a cow

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును Read more

ఎవరినీ వదిలిపెట్టాను అంటూ జగన్ వార్నింగ్
jagan fire cbn

తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం Read more

రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
MP Rakesh Rathore

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాకేశ్ రాథోడ్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ మహిళ తనపై నాలుగు సంవత్సరాలుగా పెళ్లి పేరుతో Read more

×