Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

మంత్రి పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున

హైదరాబాద్‌: త‌న కుటంబం వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు.

అనంత‌రం మంగ‌ళ‌వారం పిటిష‌న‌ర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. దీంతో రేపు ఆయ‌న కోర్టులో హాజ‌రుకానున్నారు. నాగ్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాల‌ను కూడా న‌మోదు చేయాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం రేప‌టికి వాయిదా వేసింది.

ఇదిలాఉంటే.. స‌మంత‌-నాగ‌చైత‌న్య విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. మంత్రి వ్యాఖ్య‌లు త‌మ కుటుంబ ప‌రువుకు భంగం క‌లిగించాయ‌ని ఆమెపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త గురువారం మంత్రి సురేఖ‌పై ప‌రువున‌ష్టం దావా వేశారు.

Related Posts
ఇంజెక్షన్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స
ఇంజెక్షన్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి మరియు బోస్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతాకు చెందిన శాస్త్రవేత్తల బృందం రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స కోసం అధునాతన ఇంజెక్షన్ హైడ్రోజెల్‌ను Read more

కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు
CBN delhi

కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు జరగనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి Read more

ఆస్కార్ 2025 రద్దు?
ఆస్కార్ 2025 రద్దు

లాస్ ఏంజిల్స్ను నాశనం చేస్తున్న కొనసాగుతున్న అడవి మంటల కారణంగా 2025 అకాడమీ అవార్డులు రద్దు చేయబడవచ్చు. ది సన్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, అకాడమీ Read more

ఫిల్మ్ ఛాంబర్ పై కోర్టుకెక్కిన జానీ మాస్టర్
ఫిల్మ్ ఛాంబర్ పై కోర్టుకెక్కిన జానీ మాస్టర్

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఛాంబర్ Read more