మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్.హైదరాబాద్ : హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు. కొండా సురేఖ ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ కేటీఆర్‌తో పాటు నాగార్జున కుటుంబంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమంత, నాగచైతన్య విడిపోయేందుకు కారణం కేటీఆరేనని కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.విచారణకు హాజరైన కొండా సురేఖ

సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరో నాగార్జున, కేటీఆర్ లు వేర్వేరుగా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దాఖలు వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబాన్ని ఎంతగానో బాధించాయని.. సినిమా ఇండస్ట్రీలో ఏళ్లుగా ఎంతో గౌరవంగా ఉంటున్న తమలాంటివారిపై ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల తమ పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విచారణకు హాజరైన కొండా సురేఖ.
నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో ఇప్పటికే కోర్టులో తమ వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన న్యాయవాది.. ఆ వ్యాఖ్యలను అన్ని మీడియా సంస్థలు ప్రచురితం చేసిన తర్వాత ట్విట్టర్‌లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారని తెలిపారు. మంత్రి పెట్టిన పోస్టును ధర్మాసనానికి చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయిందని.. ఖచ్చితంగా ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలని అశోక్ రెడ్డి వాదించారు.
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో హీరో అక్కినేని నాగార్జున కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ను విమర్శిస్తూ, నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై ఎలాగో ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున, తన కుటుంబం పట్ల జరిగిన దాడి కారణంగా, ఆమెపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్యాయమని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.