ఓటిటీ లోకి క్రైమ్ థ్రిల్లర్.

ఓటిటీ లోకి క్రైమ్ థ్రిల్లర్.

క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆకర్షణ,క్రేజ్‌ కారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల రూపంలో కథానాయికలు, దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పుడూ సస్పెన్స్‌, మిస్టరీ, యాక్షన్‌ మేళవింపుతో వచ్చే ఈ కథలు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతాయి. ఈ తరుణంలో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ ఓటీటీ ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది.డబ్బా కార్టెల్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను తీసుకొచ్చింది. లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డబ్బా కార్టెల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందింది.ఈ నెల 28న (ఫిబ్రవరి 28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ‘‘వాళ్లు వంట చేస్తున్నారు.కానీ అది క్రిమినల్‌గా గుడ్..’’ అంటూ విడుదల చేసిన ప్రోమో డైలాగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.ఈ సిరీస్‌కి హితేశ్ భాటియా దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ నటి షబానా అజ్మీ, గజరాజ్ రావ్, సౌత్ స్టార్ జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే, అంజలి ప్రసాద్, సాయి తమహంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెండితెరపై సీరియస్‌ క్యారెక్టర్లకు ప్రసిద్ధి చెందిన షబానా అజ్మీ ఈ సారి వెబ్ సిరీస్‌లో నటించడం విశేషం.

dabba cartel 1739874820447

క్రైమ్ థ్రిల్లర్

క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. దీనికి అదనంగా మహిళా ప్రధాన పాత్రలతో వస్తున్న ఈ సిరీస్ కొత్త అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. కుటుంబ బాధ్యతల మధ్య క్రైమ్ వరల్డ్‌లో ఎలా అడుగుపెట్టారనేది కథనంలోఅసలు ట్విస్ట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.అయితే, మహిళా పాత్రలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ మహిళా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశముంది. బాలీవుడ్, సౌత్ స్టార్ల కలయిక ఈ వెబ్ సిరీస్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని ఫిల్మీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫిబ్రవరి 28న డబ్బా కార్టెల్ స్ట్రీమింగ్ కానుండటంతో ఓటీటీ ఆడియన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కథ ప్రకారం

ఐదుగురు మధ్యతరగతి గృహిణులు తమ నిత్య జీవితాల్లో ఎదురయ్యే సమస్యల మధ్య సడెన్‌గా డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కొని, ఓ ఫార్మాసూటికల్ కంపెనీ లో పని చేసే ఉద్యోగులు కూడా ఈ డ్రగ్స్ సిండికేట్ లో ఉన్నారని తెలియడంతో ఈ కేసర్ మరింత ప్రమాదకరంగా మారుతుంది.ఎలాంటి మలుపులు తిరుగుతారనేది కథా తాలూకు హైలైట్‌.నిమిషం పై సాగే టీజర్ లో వెబ్ సిరీస్ ఎంత ఆసక్తికరంగా ఉండనుండో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. సీనియర్ నటీమణులు షబానా అజ్మీ,జ్యోతిక లాంటి వారు ఉండడంతో ఈ సిరీస్ పై మరింత ఆసక్తి రేపెలా చేస్తోంది.మరో సీనియర్ నటుడు గజరాజ్ రావ్ కూడా ఉన్నారు.

Related Posts
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు వార్నింగ్‌
Police warning on Sandhya Theater incident

హైదరాబాద్‌: సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఘాటు హెచ్చరికలు ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని Read more

మెకానిక్ రాకీ..రిలీజ్ డేట్ ఫిక్స్
Mechanic rocky0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు "మెకానిక్ రాకీ" అనే మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు Read more

ప్రముఖ నటుడు విలన్ గుర్తున్నాడా అసలు ఏం జరిగిందంటే?
ప్రముఖ నటుడు విలన్ గుర్తున్నాడా అసలు ఏం జరిగిందంటే.

ప్రముఖ మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన నటుడు టి.కె. వినాయకన్, తన అల్లరి ప్రవర్తనతో ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, Read more

పాత తరమే బెస్ట్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
పాత తరమే బెస్ట్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

మలయాళీ హీరోయిన్ పార్వతి తిరువోతు, పాత తరం నటీనటులను ప్రస్తావిస్తూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. యువ నటుల పనితీరు, సోమరితనం, నిరాశ వంటి అంశాలపై ఆమె Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *