हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

CWC Meeting : నేడు సీడబ్ల్యూసీ భేటీ.. ఢిల్లీకి సీఎం రేవంత్

Sudheer
CWC Meeting : నేడు సీడబ్ల్యూసీ భేటీ.. ఢిల్లీకి సీఎం రేవంత్

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకత్వ మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో దేశాన్ని కలిచివేసిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశంపై సమగ్ర చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొననున్నారు.

ఢిల్లీకి సీఎం రేవంత్

ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హాజరయ్యేలా పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన భేటీలో రాష్ట్రపరమైన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మక దిశను నిర్దేశించే క్షణం

ఈ సీడబ్ల్యూసీ భేటీ రాజకీయంగా కీలకంగా మారనుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మక దిశను నిర్దేశించే క్షణం దీనిని భావిస్తున్నారు. ముఖ్యంగా, పహల్గామ్ దాడిపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ తన దృష్టికోణాన్ని స్పష్టం చేయనుంది.

Read Also : Fire Accident : కేంద్ర మాజీ మంత్రి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870