Cutting down trees is worse than killing people.. Supreme Court

Supreme Court : చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీంకోర్టు

Supreme Court: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం అంటోంది. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది. తాజ్‌ ట్రాపిజెమ్‌ జోన్‌ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్‌ నిర్వాహకుడు శివ్‌ శంకర్‌ అగర్వాల్‌.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

 చెట్లను నరకడం మనుషుల్ని చంపడం

పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు.

అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజల్‌ భుయాన్‌ ధర్మాసనం అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా చూడాలంటే చెట్లు అవసరం. వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అభిప్రాయపడింది.

చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా

ఇక,ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే.. అగర్వాల్‌ తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ.. తన క్లయింట్‌ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడని, అందుకు సంబంధించి అఫిడవిట్‌ కూడా కోర్టుకు సమర్పించామని తెలియజేశారు. అయినప్పటికీ జరిమానా విషయంలో ధర్మాసనం అస్సలు తగ్గలేదు.

Related Posts
చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం – అంబటి
ambati polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి చంద్రబాబు నాయుడి అవగాహనారాహిత్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ తీసుకున్న Read more

బానిసలకే ఆ ఆఫర్.. తేల్చేసిన ట్రంప్
trump

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దుచేసేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ Read more

నాకు ఆ పదం నచ్చదు – బన్నీ
pushpa 2 sm

తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని, హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని పుష్ప-2 థాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ Read more

ఈ నెల 30 నుండి తెలంగాణలో బీజేపీ నిరసనలు..
BJP protests in Telangana from 30th of this month

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తికావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్ గా బీజేపీ ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో నిరసన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *