ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సేవల (Medical Services) ప్రమాణాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని తొమ్మిది సర్వజన ప్రభుత్వ ఆస్పత్రుల్లో(Government Hospitals) అధునాతన సీటీ స్కాన్ యంత్రాలు, క్యాథ్ ల్యాబ్(CT Scan Machines, Cath Lab)లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆమోదం తెలుపగా, త్వరలో ఈ సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ యంత్రాలు
ఈ కార్యక్రమం కింద గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో విశేషం ఏంటంటే, విశాఖ GNCDD (గవర్నమెంట్ న్యూరో సెంటర్)లో తొలిసారిగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల న్యూరోలాజీ, ట్రామా కేసులకు సంబంధించి త్వరిత పరీక్షలు, సమయసీమిత చికిత్సలు అందించగలగడం జరుగుతుంది.
పేద, మధ్య తరగతి రోగులకు మెరుగైన కార్డియాలజీ సేవలు
ఇక గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్సకు ఎంతో అవసరమైన క్యాథ్ ల్యాబ్‌లను తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సదుపాయాల ద్వారా పేద, మధ్య తరగతి రోగులకు మెరుగైన కార్డియాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఈ పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది. తాజా నిర్ణయం పబ్లిక్ హెల్త్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను ప్రభుత్వ రంగంలోనే అందించేందుకు సహాయపడుతుంది.
Read Also : Ursa : ‘ఉర్సా’ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? – అమర్నాథ్