ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు మదురై జిల్లా అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వాంజినాతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిబంధనల ఉల్లంఘన, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆరోపణలు
ఈ కేసులో పోలీసులు IPC సెక్షన్ 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు. సదస్సు సందర్భంగా పవన్ కళ్యాణ్ మతం మరియు ప్రాంతాల ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు FIRలో ఉన్నాయి. మదురైలో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజకీయ దుమారం, అధికార వర్గాల స్పందన
ఈ కేసు నమోదు నేపథ్యంలో తమిళనాడు(Tamilanadu)తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఒకరితరఫున ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలపై కుట్రగా చూస్తుండగా, మరికొందరు చట్టాన్ని అతిక్రమించినట్లయితే దర్యాప్తు జరగాల్సిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు మాత్రం కేసు నమోదు ప్రాథమిక దశలోనే ఉందని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రావాల్సి ఉంది.
Read Also : Terrorist Arrest రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు