టాలీవుడ్ యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి వార్తల్లో నిలిచారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు విజయ్ దేవరకొండను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఉదయం హాజరయ్యారు.వివరాల ప్రకారం, కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు దేశంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్‌లకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో కొందరు టాలీవుడ్ నటులు, సెలబ్రిటీలు పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ యాప్‌లకు ప్రమోషనల్ వీడియోలు, సోషల్ మీడియా ప్రచారాలు చేసినట్లు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో పాటు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు కూడా వెలువడ్డాయి.

ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు
గత నెల 30న ప్రకాశ్ రాజ్ ఈడీ విచారణకు హాజరై దాదాపు ఆరు గంటలపాటు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి రావడంతో ఈడీ మరోసారి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండకు సమన్లు జారీ చేసింది. ఈరోజు ఆయన విచారణకు హాజరై తనకు తెలిసిన విషయాలను అధికారులకు వివరించినట్లు సమాచారం.సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లు ప్రధానంగా క్రీడా పోటీలపై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహించి కోట్లాది రూపాయల లావాదేవీలు చేసినట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో విదేశీ కరెన్సీ మార్పిడి, మనీ లాండరింగ్ అంశాలు ఉన్నాయనే అనుమానంతో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
విజయ్ దేవరకొండ కుటుంబం గురించి చెప్పండి?
ఆయన తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ ఒక టెలివిజన్ డైరెక్టర్, తల్లి మాధవి దేవరకొండ గృహిణి. ఆయనకు ఆనంద్ దేవరకొండ అనే తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా సినిమాలలో నటిస్తున్నారు.
విజయ్ దేవరకొండ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
విజయ్ తన స్కూలింగ్ హైదరాబాదులోని పట్మాషాలి స్కూల్, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. బాచిలర్స్ డిగ్రీ Badruka College of Commerce లో పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: