ఉత్తరాఖండ్‌లోని( Uttarakhand) తెహ్రీ గడ్‌వాల్ జిల్లాలో ఆదివారం ఉదయం పెద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. గుజరాత్, ఢిల్లీకి చెందిన 29 మంది ప్రయాణికులతో రిషికేశ్‌లోని కుంజాపురి దేవాలయానికి వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి సుమారు 70 మీటర్ల లోయలో పడిపోయింది.
Read Also: TG Crime: ఘట్కేసర్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు( Uttarakhand) కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి గ్రామస్తులు, స్థానిక సిబ్బంది పరుగున చేరుకుని రక్షణ చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. బస్సు పూర్తిగా దెబ్బతిన్న దృశ్యాలు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారీ లోయలో పడిపోయినందున ప్రయాణికులు ఎలా బయటపడ్డారో ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉన్నట్లు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: