యూపీ (Uttar Pradesh) లో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.
Read Also: POCSO Case: బాలికపై పెంపుడు తండ్రి అఘాయిత్యం..గర్భం దాల్చిన బాలిక
పూర్తీ వివరాలు
వివరాల్లోకి వెళితే, కాన్పూర్‌కు చెందిన అర్తి యాదవ్ (30) నవంబర్ 26న ఢిల్లీ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆమె ఎక్కాల్సిన రైలు 10 గంటలు ఆలస్యం కావడంతో, పొరపాటున పట్నా-ఆనంద్ విహార్ స్పెషల్ రైలు ఎక్కారు. ఈ క్రమంలో S-11 కోచ్‌లో టీటీఈ సంతోష్ కుమార్‌కు, ఆమెకు మధ్య టికెట్‌పై వాగ్వాదం జరిగింది.

టీటీఈ మొదట ఆమె లగేజీని రైలు నుంచి విసిరేశారని, ఆ తర్వాత ఆమెను కూడా తోసివేశారని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏటవా జిల్లాలోని సమ్హోన్-భర్తనా స్టేషన్ల మధ్య రైలు ట్రాక్‌పై అర్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె లగేజీ ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. ఇది కచ్చితంగా హత్యేనని అర్తి తండ్రి అనిల్ కుమార్ ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతుండగా
“ఘటన జరిగిన తర్వాత టీటీఈ రైలును ఆపకుండా, చైన్ లాగకుండా 30 కిలోమీటర్ల దూరంలోని ఏటవా జంక్షన్ వరకు ఎలా వెళ్లారు?” అని ఆయన ప్రశ్నించారు. మృతురాలు అర్తి యాదవ్‌కు 2020లో నేవీ చీఫ్ పెట్టీ ఆఫీసర్ అజయ్ యాదవ్‌తో వివాహమైంది. అజయ్ ముంబైలో పనిచేస్తుండగా, అర్తి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతుండగా ఈ ఘోరం జరిగింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: