మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మీర్జాపూర్ జిల్లా, చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర రైలు(train) ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ ఘటనలో దాదాపు నలుగురు మరణించినట్లు తెలుస్తోంది.
Read Also: Hyderabad: చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ అత్యాచారం

ప్రమాదానికి కారణం, కార్తీక పౌర్ణమి
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా కార్తీక పౌర్ణమి(Kartika paurṇami) నేపథ్యంలో గంగా స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న యాత్రికులుగా గుర్తించారు. ప్రయాణికులు రాంగ్ రూట్‌లో రైల్వే లైన్ దాటుతుండగా, ప్లాట్‌ఫామ్ నంబర్ మూడు మీదుగా వేగంగా వెళుతున్న రైలు వారిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు ముక్కలు ముక్కలైనట్లు సమాచారం.
పోలీసులు, సహాయక చర్యలు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు రాంగ్ రూట్‌లో ట్రాక్ దాటడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: