ఉత్తరప్రదేశ్(UP crime)లోని వారణాసి సమీపంలోని కర్ధన గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు విషపూరితమైన ‘కనేర్’ (ఒలియాండర్) మొక్క పండ్ల(poisonous fruits)ను తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆటల్లో భాగంగా పండ్లను రుచి చూసిన కొద్దిసేపటికే వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

వెంటనే చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఇద్దరు పిల్లలు ఆదివారం రోజునే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విష ప్రభావానికి గురైన మూడో బిడ్డ సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులను కోల్పోవడంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే భావిస్తున్నామని, ఇప్పటివరకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. పిల్లలు విష మొక్కలను గుర్తించలేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: