
Burqa Controversy: ప్రతి మతంలో సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వాటిని గౌరవించాల్సిందే. కానీ మతం కంటే దేవుడు గొప్పవాడు. ఆచారాలముసుగులో దేవుడినే విస్మరిస్తున్నారు. ఇలా సృష్టికర్తను విస్మరిస్తే.. వాటి పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఓ వ్యక్తి భార్యను, కుమార్తెలను బురఖా ధరించమని కోరాడు. అందుకు భార్య నిరాకరించింది. దీంతో చిన్న గొడవ తెచ్చిన తంటా, ముగ్గురి హత్యకు దారితీసింది.
Read also: Hyd Crime: తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్(UP Crime) రాష్ట్రంలో షామ్లీ జిల్లాలో ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. కాండ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గఢీ దౌలత్ గ్రామంలోని ఓ కుటుంబ కలహాలు చివరకు ఊహించని మలుపు తీసుకుంది. బుర్కా వేసుకోవడాన్ని నిరాకరించిందన్న కారణంతో భర్త తన భార్యను కాల్చిచంపాడు. అంతేకాక తన ఇద్దరు మైనర్ కుమార్తెలను కూడా హతమార్చాడు.
సెప్టిక్ ట్యాంక్ లో పాతిపెట్టిన నిందితుడు
ఫారుక్ అనే వ్యక్తి భార్యాపిల్లలకు హతమార్చిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముగ్గురి మృతదేహాలను(Dead bodies) ఇంటి ఆవరణలో ముందుగానే తవ్వించిన సెప్టిక్ ట్యాంక్ లో పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు ఫారుక్, ఇతడు ఓ హోటల్ లో రోటీ మాస్టర్. తండ్రి, సోదరుల నుంచి వేరుగా నివసిస్తున్న ఫారుక్ కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. భార్య తాహిరా, కుమార్తెలు ఆఫ్రిన్ (16), సహరీన్ (14) బుర్కా ధరించి బయటకు వెళ్లాలని ఫారుక్ ఒత్తిడి తెచ్చేవాడని, దీనికి తాహిరా అంగీకరించకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఫారుక్ తీవ్ర అవమానంగా భావించాడు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫారుక్ తండ్రి
సుమారు పదిరోజులుగా కోడలు, ఇద్దరు మనువరాళ్లు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఫారుక్ తండ్రి దావూద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫారుక్ ను విచారించగా మొదట్లో అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు తమదైనశైలిలో ప్రశ్నించడంతో చివరకు ఫారుక్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. భార్య, కుమార్తెలు బుర్కా లేకుండా బయటకు వెళ్లడంపై అతడికి తీవ్ర కోపం వచ్చేదని, అదే కోపంతో క్యారానా నుంచి అక్రమంగా తుపాకీ, అందులోకి బుల్లెట్స్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. ముందు ప్రణాళిక ప్రకారం ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ తవ్వించాడు. ఘటన సమయంలో భార్య తాహిరా తన పుట్టింట్లో ఉండగా, ఫారుక్ ఆమెను ఇంటికి రమ్మని పిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: