తిరుమల : దర్యాప్తు చివరి దశలో సిట్ మరింత దూకుడు సుబ్రహ్మణ్యం అరెస్టుతో కదులుతున్న కల్తీ నెయ్యి డొంక నాలుగు రోజుల్లో మరికొందరు అరెస్టయ్యే అవకాశం తిరుమల వెంకన్నలడ్డూల తయారీలో కల్తీనెయ్యి సరఫరా, వినియోగించారన్న పాపంలో కీలకంగా బాధ్యుడైన టిటిడి (Tirumala) మార్కెటింగ్ విభాగం (కొనుగోళ్లు) జిఎం కె. సుబ్రమణ్యంను గురువారం సాయంత్రం సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఎన్జీఒ కాలనీలో నివాసముంటున్న ఆయన్ను టిటిడి భవనం నుండి అరెస్టు చేసి రుయాకు తరలించారు. రుయా ఆస్పత్రిలో ఆయనకు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఆయన అరెస్ట్ను టిటిడి అధికారులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ రాత్రికి నెల్లూరు ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. కల్తీనెయ్యి బాగోతంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జనవరి నుండి దర్యాప్తు చేస్తున్న సిబిఐ సిట్ అధికారులు తాజాగా మార్కెటింగ్ జిఎం అరెస్ట్ మొత్తం పదిమందికి చేరింది. అయితే అధికార వర్గాల వైపునుండి మార్కెటింగ్ జిఎం అరెస్ట్ తొలిగా

TTD Marketing GM arrested
టిటిడిలో సంచలనం
ఈ కేసులో ఇప్పటివరకు పలుకోణాల్లో విచారణ చేసిన సిట్ బృందం నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వ్యాపారులను మాత్రమే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇంకా మరో కోణంలో రెండు వారాల క్రిందట టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పూర్వ పిఎ చిన్నఅప్పన్నను అరెస్ట్ చేసిన సిట్ కీలక సమాచారం సేకరించడం, ఆ తరువాత సుబ్బారెడ్డిని, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డిని విచారణ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు టిటిడి వర్గాల నుండి మార్కెటింగ్ జిఎంను అరెస్ట్ చేసిన సిట్ మరీ ఈనెలాఖరుకు ఇంకెవరినీ అరెస్ట్ చేయనుందనేది టిటిడిలో సంచలనంగా మారింది. కల్తీనెయ్యి బాగోతంలో పోటు విభాగంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తిన దరిమిలా అప్పటి పోటు అధికారులకు అరెస్ట్ చేసిన భయం పట్టుకుంది. టిటిడిలో ఒక్క నెయ్యి సరఫరాకు సంబంధించి మాత్రమేగాక ముడిపదార్థాలు, ఆహారపదార్థాలు, పప్పులు, యాలకులు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు వంటి సరుకులు కొనుగోలుకు మార్కెటింగ్ విభాగం నుండి టెండర్ ప్రతిపాదనలు తయారుచేసి టిటిడి ఇఒకు, జెఇఒకు ఫైల్ పంపుతారు.
2019-2024 సంవత్సరం మధ్యకాలం
దీన్ని పరిశీలించిన టిటిడి ఉన్నతాధికారులు అనంతరం టిటిడి బోర్డు ఆమోదం పొందుతారు. ఈ కొనుగోళ్లు నాణ్యతగా ఉండేలా, సరసమైన ధరలకు కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ విభాగం అధికారులతోబాటు బోర్డు సభ్యులను కొనుగోళ్ల కమిటీలో నియమించి అంతా సజావుగా జరిగేలా చూస్తారు. మార్కెటింగ్ విభాగంలో కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడటంతోబాటు నాణ్యతలేని నెయ్యి సరఫరాకు ఈయన సహకరించారనేది ఆరోపణలు. అయితే 2019-2024 సంవత్సరం మధ్యకాలంలో ఐదేళ్లలో అప్పటి వైసిపి ప్రభుత్వం హయాంలోని వైసిపి బోర్డులో ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇఒ ఏవి ధర్మారెడ్డి, కొందరు బోర్డు సభ్యులు కీలకంగా అధికారం చలాయించారనేది టిటిడి ఉద్యోగుల్లో వినిపించిన వ్యాఖ్యలు.
రోజుకు 12వేల కిలోల నెయ్యి
ఇదే నేపధ్యంలో శ్రీవారి లడ్డూల తయారీకి అవసరమైన నెయ్యి సరఫరా చేసేలా అప్పటి బోర్డులో పెద్దలు ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబాడెయిరీ, తమిళనాడు లోని ఎఆర్ డెయిరీ, తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవీ డెయిరీ, ఉత్తరప్రదేశ్ లోని మాల్గంగ డెయిరీలకు, ప్రుడెన్షియల్ ఆగ్రోపుడ్స్ డెయిరీల నుండి 1.61కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేసినందుకు 250 కోట్ల రూపాయలు వరకు టిటిడి నగదు చెల్లించింది. ఇందులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీజరిగినట్లు అధికారులు గుర్తించారు. తిరుమల ఆలయంలో పోటులో లడ్డూల తయారీకి రోజుకు 12వేల కిలోల నెయ్యి వినియోగం జరుగుతుంది. కల్తీనెయ్యి సరఫరా జరిగినా పరీక్షల ద్వారా తెలుసుకుని వెనక్కు పంపాల్సిన టిటిడి మార్కెటింగ్ విభాగం ఎందుకు మౌనం వహించిందనేది ఇప్పటికీ అర్థంకాని సమస్య. అంతేగాక మార్కెటింగ్ విభాగం, పరిశోధనశాల అధికారులపై ఒత్తిడి చేసిన అప్పటి బోర్డులో పెద్దలు, ఉన్నతాధికారులు ఎవరనేది కూడా ఇప్పుడు మార్కెటింగ్ జిఎం సుబ్రమణ్యంను సిట్ విచారణ చేసి కీలక సమాచారం రాబట్టనుంది. ఈ కేసు దర్యాప్తు దాదాపు చివరిదశకు చేరుకోవడంతో సిట్ అధికారుల బృందం దూకుడు మరింత పెంచింది.
నెలాఖరులోపు నెక్ట్స్ అరెస్ట్ ఎవరో?
తిరుమల లడ్డూల తయారీకి కల్తీనెయ్యి సరఫరా జరిగిన సంచలన వ్యవహారంలో ఇప్పటికే 10మందిని పాత్రధారులను అరెస్ట్ చేసిన సిబిఐ సిట్ అధికారుల బృందం గురువారం మార్కెటింగ్ జిఎంను అరెస్ట్ చేయడంతో నెలాఖరు లోపు సూత్రధారులను అరెస్ట్ చేయనుందనేది టిటిడిలో పెద్ద చర్చ మొదలైంది. టిటిడిలో ఎలాంటి నిధులు మంజూరు చేయాలన్నా, టెండర్లు పిలవాలన్నా, ఆ టెండర్లు ఏ సంస్థకు అప్పగించాలనే విషయాలపై అధికారులు ప్రతిపాదనలు తయారుచేసేలా టిటిడి ఉన్నతాధికారులు, బోర్డులో చైర్మన్, కొందరు సభ్యులు కీలకం. అలాంటిది 2019-24 మధ్య కాలంలో నెయ్యి సరఫరాకు టెండర్లు ఆమోదించిన కీలక సభ్యులు, అధికారులు ఇప్పుడు తెరపైకి రానున్నారు. సిట్ చిన్నఅప్పన్నను కూడా కస్టడీకి తీసుకుని అవసరమైన సమా చారం రాబట్టిందనేది తెలిసింది. ఇప్పటికే ఈకల్తీనెయ్యి సరఫరా, వినియోగించి లడ్డూల తయారీలో సిట్ అధికారులు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డిని విచారణ చేసినా వరస్పరం ఆటు బోర్డుపై ఇటు అధికారులపై వాదనలు వినిపించారనేది సిట్ రాబట్టిన కీలక విషయాలు. మరీ ఈ నేపధ్యంలో మలివిడతగా ఆ ఇద్దరు కీలక వ్యక్తులను మూడురోజుల్లో మళ్లీ విచారణ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది కూడా టిటిడి వర్గాలను కలవర పెడుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: