Tirupati Crime: తిరుపతి : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బిఎడ్ మొదటి సంవత్సరం విద్యార్థిని (27)పై లైంగిక వేధింపుల కేసులో తిరుపతి పోలీసులు బాధ్యులైన ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సిఎం చంద్రబాబునాయుడు, హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపధ్యంలో తిరుపతి (Tirupati) సిఐ మురళీమోహన్, ఇద్దరు మహిళ ఎస్ఐలను ఒడిశాకు పంపారు. మంగళవారం ఉదయం నుండి బాధిత విద్యార్థిని పూర్తి స్థాయిలో విచారణ చేసి వీడియో రికార్డు చేశారు.
Read also: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి

National Sanskrit University professors arrested
ఇద్దరు ప్రొఫెసర్లను మంగళవారం అరెస్ట్ చేశారు
బాధితురాలి ఫిర్యాదు, వెల్లడించిన ఆధారాలతో సాయంత్రానికి తిరుపతిలో వెస్ట్ పోలీసులు బాధ్యులైన ఇద్దరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్లు ఆచార్య లక్ష్మణ్ కుమార్, ఆచార్య శేఖర్ రెడ్డి లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే తిరుపతి పోలీసులు 75(1), 77, 79, 351(2), రెడ్విత్ 3(5) బిఎన్ఎస్ ప్రకారం 183/2025 కేసు నమోదుచేశారు. ఈ కేసు దర్యాప్తు చేసి ముద్దాయి లుగా ఉన్న ఆ ఇద్దరు ప్రొఫెసర్లను మంగళవారం అరెస్ట్ చేశారు. విద్యార్థినులు, మహిళల భద్రతలో రాజీలేదని, మహిళల భద్రతకు తిరుపతి పోలీసులు కట్టుబడి ఉంటారని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: