తిరుపతిలో బాలుర వసతి గృహంలో దారుణం
తిరుపతి బాలుర వసతి గృహంలో జారిన హృదయ విదారక ఘటన ఒకటి సోషల్ మీడియాలో కలకలం రేపింది. అక్కడ (Tirupathi) పనిచేసే నైట్ వాచ్‌మెన్ రెండు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాచ్‌మెన్ రాత్రి సమయంలో ఆ బాలురను తన గదికి తీసుకెళ్లి, గదీ తలుపు లాక్ చేసి, మొదట బ్లూ ఫిల్మ్‌లు చూపించి, ఆ తరువాత ఆ చిన్నారుల దుస్తులు విప్పి, తన పంచె కూడా విప్పి లైంగికంగా వేధించినట్లు బాలుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేశాడు.
Read also: రంగారెడ్డి జిల్లాకు దేశంలోనే మొదటి ధనిక స్థానం

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు
ఈ సంఘటన గురించి బాలురలో ఒకరు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే తల్లిదండ్రులు వసతి గృహం వార్డెన్‌ను సంప్రదించారు. నవంబర్ 4న (Tirupathi) తెల్లవారుజామున, తిరుపతిలోని చైల్డ్ & ఉమెన్ సేఫ్టీ సెల్‌లో ఈ విషయంపై ఫిర్యాదు దాఖలు చేయబడింది. ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద పోక్సో చట్టం (POCSO Act) మరియు భారతీయ దండ స్మృతి (IPC) యొక్క సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి ప్రక్రియ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: