నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నవీపేట్ మండల పరిధిలో గుర్తుతెలియని మహిళను హత్య చేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. ఈ ఘటన బాసర ప్రధాన రహదారి సమీపంలోని ఫకీరాబాద్, మిట్టాపూర్ శివారులో చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం స్థానికులు రహదారి పక్కన మహిళ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read Also: GHMC: పారిశుద్ధ్య కార్మికురాలి పై అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి
మహిళ తల, కుడి చేతి వేళ్లు నరికి వివస్త్రను చేసిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం వివస్త్రగా ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో నవీపేట్ ఎస్సై తిరుపతి సిబ్బందితో వెళ్లి స్పాట్‌కు చేరుకుని హత్య జరిగిన తీరు, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో
అనంతరం ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇటీవల మరో మహిళ కూడా ఇలాగే హత్యకు గురైంది. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు అనుమానస్పద స్థితిలో మరణించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: