(TG Crime) చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద గత నెల 3న ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్ సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, తాజాగా (TG Crime) ఈ కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషాదానికి కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కారణం కాదని.. వాహన యజమాని మితిమీరిన లాభాపేక్షే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. దీంతో టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను సవరించారు.
Read Also: Canada Crime: కెనడాలో ఇండియన్ ఉమెన్ హత్య.. ప్రియుడిపై అనుమానం
నిబంధనలకు విరుద్ధం
దర్యాప్తు వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో టిప్పర్ పరిమితికి మించిన లోడ్‌తో ఉంది. వాహనం బరువు ఎక్కువగా ఉండటం వల్ల వేగాన్ని నియంత్రించడం డ్రైవర్‌కు కష్టమైంది. దీనికి తోడు వాహనం రాంగ్ రూట్‌లో అతి వేగంగా ప్రయాణించడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ పక్కనే ఉన్న యజమాని లచ్చు నాయక్.. డ్రైవర్ ఆకాష్ కాంబ్లేను హెచ్చరించకపోగా, అధిక లోడుతో వాహనాన్ని నడపమని ప్రోత్సహించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వాహనాన్ని రోడ్డుపైకి అనుమతించడం క్రిమినల్ నిర్లక్ష్యం కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేస్తారు. కానీ.. చేవెళ్ల పోలీసులు ఈ కేసులో వాహన యజమాని పాత్రను లోతుగా విశ్లేషించారు. అధిక లోడు వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని, వాహనం నియంత్రణ తప్పుతుందని తెలిసి కూడా అనుమతించినందుకు లచ్చు నాయక్‌పై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం లచ్చు నాయక్ కూడా అదే ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అతను కోలుకున్న వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: