Crime news; రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కూకట్పల్లి(kukatpally) చిన్నారి సహస్ర హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. పదేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా 27కత్తిపోట్లతో చంపిన బాలుడు, ఆ తర్వాత గంటలోనే తన పెంపుడు కుందేలుపై ప్రేమ, జాలి చూపించడం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతని పవర్తనలోని భిన్న కోణాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

దొంగతనం సహస్ర చూసిందని హతమార్చిన బాలుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు బ్యాట్ దొంగతనం చేస్తూ సహస్రకు పట్టుబడ్డాడు. దీంతో ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఏమాత్రం జంకు లేకుండా గోడదూకి తన ఇంట్లోకి వెళ్లాడు. ఒంటిపై ఉన్న రక్తపు మరకలు కుటుంబ సభ్యులకు కనపడకుండా బట్టలు మార్చుకున్నాడు నిందితుడు. ఆ వెంటనే అనారోగ్యంతో ఉన్న పెంపుడు కుందేలును పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తు, ఆ కుందేలు కూడా అదేరోజు చనిపోయింది. హత్య చేసిన వ్యక్తిలా కాకుండా పోలీసుల విచారణకు కూడా అతడు సహకరించడం అధికారులను విస్మయపరిచింది.
ఆర్థిక పరిస్థితులపై పోలీసుల ఆరా..
నిందితుడు కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, తల్లి ఒక్కరే కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కుందేలు పెంపకానిక, స్మార్ట్ఫోన్ కొనుగోలుకు అతనికి డబ్బులు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు, స్కూల్లో స్నేహితులు తనను బక్కగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేసేవారని, దాంతో అతను ఒంటరిగా ఉంటూ ఎక్కువగా యూట్యూబ్లో క్రైమ్ వెబ్ సీరీస్లు(Crime web series) చూసేవాడని పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో కేసును మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అతని మానసిక స్థితిని అంచనా వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా హాయిగా ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి దారుణాలకు పాల్పడడం మన సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. బిడ్డలకు అన్ని వస్తువులను సమకూరిస్తే చాలని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారికి సౌకర్యాలు ఇవ్వడమే కాదు, వారి ప్రవర్తనావిధానాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. స్మార్ట్ఫోన్లు వారికి చేతికి ఇవ్వడమే కాదు, అందులో వారు వేటిని చూస్తున్నారని కూడా కనిపిపెడుతూ ఉండాలి. అప్పుడే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా అదుపులో ఉంచగలం.
బాలుడు నేరాలపై ఆసక్తి ఎందుకు పెంచుకున్నాడు?
స్కూల్‌లో బాడీ షేమింగ్‌కు గురవుతూ, ఒంటరిగా ఉంటూ యూట్యూబ్‌లో క్రైమ్ వెబ్ సీరీస్‌లు ఎక్కువగా చూడటం వల్ల అతని ఆలోచనలపై ప్రభావం చూపిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ సంఘటన సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుంది?
పిల్లలకు సౌకర్యాలు ఇవ్వడమే కాదు, వారి ప్రవర్తన, స్మార్ట్ఫోన్ వాడకం, ఆలోచనావిధానంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: