Crime News: వివాహేతర సంబంధాలు ఎప్పటికీ మంచివి కావు. అవి ఏదోఒక విధంగా అనుబంధాలను దెబ్బతీస్తాయి. జీవితాలు పాడు చేస్తాయి. బుగ్గిపాలు కూడా చేస్తాయి. ఇటీవల వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం సంసారాలను పాడు చేసుకుంటున్నారు. పెద్దల తప్పులకు పిల్లలు బలైపోతున్నారు. వారు అనాథులుగా మిగిలిపోతున్నారు. సమాజంలో కుటుంబాలు బాగున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది. పెళ్లై ఓ కూతురు ఉన్నా మరోకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన ఓ ఇల్లాలు చివరికి ప్రియుడి చేతిలోనే హతమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వదిలించుకునేందుకు ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని మైసూర్ పరిధిలోని సలిగ్రామ్ లో ఈ దారుణఘటన చోటుచేసుకుంది. సిద్దరాజు అనే యువకుడితో దర్శిత (22) అనే యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరిమధ్య శారీరక సంబంధం ఏర్పడడంతో పెళ్లి చేసుకుందామని దర్శిత ప్రియుడిని కోరింది. దీంతో ఏదో ఒక సాకుచెబుతూ సిద్ధరాజు కాలం వెల్లబుచ్చాడు. ఇంతలో కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తికి దర్శితను ఇచ్చి పెళ్లి చేసారు దర్శిత తల్లిదండ్రులు. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. కొంతకాలం తర్వాత ఉపాధి నిమిత్తం సుభాష్ దుబాయ్ కి వెళ్లిపోవడంతో భర్తతో ఉండలేకపోతున్నానని మళ్లీ సిద్ధరాజును బలవంతం చేయసాగింది దర్శిత.
హతమార్చేందుకు స్కెచ్ వేసిన ప్రియుడు
ఎలాగైనా దర్శితను వదిలించుకోవాలని ప్రియుడు సిద్ధరాజు ప్లాన్ వేసుకున్నాడు. ఒక హోటల్కి దర్శితను తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి కూతురితో సహా సిద్ధరాజుతోనే ఉంటానని ఖరాఖండిగా దర్శిత చెప్పడంతో ఆమెను దారుణంగా కొట్టి, నోట్లో డిటోనేటర్(Detonator) పెట్టి పేల్చేశాడు సిద్ధరాజు. దీంతో ఆమె మొహం చిద్రమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో చనిపోయింది దర్శిత. రెండు రోజులుగా దర్శిత కనిపించడం లేదని అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా హోటల్లో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు హోటల్ సిబ్బంది. విచారణలో ఛార్జింగ్ పెట్టే ప్రయత్నంలో సెల్ఫోన్ పేలడంతో దర్శిత చనిపోయిందని చెప్పాడు సిద్ధరాజు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడు సిద్ధరాజు. దీంతో అతడిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు పోలీసులు.
హత్యకు కారణం ఏమిటి?
ప్రియురాలు తనతోనే జీవించాలంటూ ఒత్తిడి చేయడంతో, ఆమెను వదిలించుకోవడానికి ప్రియుడు సిద్ధరాజు హత్య చేశాడు.
ప్రియుడు దర్శితను ఎలా హతమార్చాడు?
ఒక హోటల్లో దర్శిత నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చి హత్య చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: